యెన్.టి.ఆర్. “పాతాళ భైరవి” లో తోట రాముడిగా చేయకుండా ఉంటె, ఏ.యెన్.ఆర్.” దేవదాసు” కాకపోయి ఉంటె, వాట్ నెక్స్ట్? అంటే మీరేమంటారు. తినే ప్రతి మెతుకు మీద తినేవారి పేరు రాసి ఉంటుంది అంటారు, అలాగే చేసే ప్రతి పాత్ర వారికోసమే పుట్టింది అన్నట్లుగా నటించిన మహా నటులు వారిద్దరూ. కొన్ని సార్లు వారు చేయవల్సిన పాత్రలు వేరే వారు చేయటం, వేరే వారు చేయవలసిన పాత్రలు వీరు చేయటం జరిగి ఉండవచ్చు, కానీ యెన్.టి.ఆర్ చేయవలసిన పాత్రను కొట్టేయాలని చిన్న జిమ్మిక్కు ప్లే చేసిన నటుడు ఒకరు ఉన్నారు అప్పటి తెలుగు పరిశ్రమలో, అతను ఎవరో మీకు తెలుసా? అతనే కస్తూరి శివ రావు, అప్పటి పాపులర్ నటుడు. పాతాళ భైరవి కథ ప్లాన్ చేసిన కె.వి.రెడ్డి గారు శివ రావు తో యెన్.టి.ఆర్. కి కబురు పెట్టారు, యెన్.టి.ఆర్ రాలేదు. ఏంటి శివ రావు రామ రావు కి చెప్పావా అని అడిగిన రెడ్డి గారికి శివ రావు నీళ్లు నములుతూ, రామ రావు బిజీ గ ఉన్నాడు అందుకే రాలేదేమో అనే సమాధానం ఇచ్చారట. ఓ! అంత బిజీ గ ఉన్నాడా, నేను రమ్మన్నాని చెప్పిన, రాలేనంత, బిజీ గ ఉన్నాడా ఒకే, అన్నారట కె.వి.రెడ్డి గారు. మరుసటి రోజు యెన్.టి.ఆర్ రూమ్ ముందు ప్రత్యక్షం అయ్యారట కె.వి.రెడ్డి, ఆయనను చూసిన యెన్.టి.ఆర్
అయ్యా! మీరు ఇంత దూరం రావటం ఏమిటి కాకితో కబురంపితే, రెక్కలు కట్టుకొని వాలే వాడిని కదా అన్నారట, ఏమిటి రామ రావు చాల బిజీ గ ఉన్నావట, నన్ను కలవటానికి రాలేనంత బిజీ గ ఉన్నావా? శివ రావు చెప్పాడు అన్నారట. అయ్యో ఎంత మాట తమరు రమ్మన్నట్లు, శివ రావు నాతో చెప్పనే లేదు అన్నారట యెన్.టి.ఆర్. దిగ్గజ దర్శకుడు, వర్ధమాన నటుడు మధ్య చిచ్చు పెట్టాలని చూసిన శివరావు మీద కోపం వచ్చింది రెడ్డి గారికి. “పాతాళ భైరవి” షూటింగ్ ప్రారంభం అయింది, ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన శివ రావు ను చూసి రెడ్డి గారు ఏమి శివ రావు, నువ్వే హీరో వేషం వేయాలనుకున్నావా అని అడిగారట, కొంచెం బెదిరిన శివ రావు తల దించుకున్నాడట, చూడు శివ రావు కొన్ని, కొన్ని కొందరితోనే చేయించాలి, అందరు అన్నింటికీ పనికి రారు గుర్తుంచుకో అని మందలించారట. ఈ సినిమా రామ రావు తో చేయించాలనే, కథ తయారు చేశాను ఒక వేళ రామ రావు కాదని ఉంటె, ఈ సినిమా ఆపేసి ఉండేవాడిని, నీతో తీస్తాని ఎలా అనుకున్నావ్ అన్నారట, అది కె.వి.రెడ్డి గారి కమిట్మెంట్. అందుకే అయన ఆణి ముత్యాల వంటి సినిమాలు తీయ గలిగారు. అదుష్టవంతడిని ఎవరు చెడగొట్టలేరు, దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు, అదండీ జీవిత సత్యం. ఆ తరువాతి కాలంలో యెన్.టి.ఆర్. ఎక్కడ నుంచి ఎక్కడకు ఎదిగారు, కస్తూరి శివ రావు ఏమయ్యాడు మనందరికీ తెలిసిందే..!!