భారతీయ చిత్రాలలో కొన్నిభారీ చిత్రాలకు సౌండ్ డిజైనర్ గా పని చేసిన రెసూల్ పూకుట్టి ఎస్ ఎస్ రాజమౌళి నిర్మించిన, రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రలుగా నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ గురించి రచయిత, నటుడు మనీష్ భరద్వాజ్ ‘చెత్త’ అని ట్విట్ చేశారు. అతని ట్విట్ పై స్పందించిన రెసూల్ ‘గే లవ్ స్టోరీ’ అని బదులు ఇచ్చారు. అంతేకాకుండా దీనిలో వారికి ‘ఆసరా’ గా అలియా భట్ ను ఉపయోగించుకున్నారంటూ మరో ట్విట్ చేశారు..దీనిపై స్పందించిన అభిమానులు ఆయన పై కోపంగా ఉన్నారు.
‘ఒక ఆస్కార్ విజేత నుండి ఇలాంటి మాటలు వినాల్సి వస్తుందని మేము ఊహించలేదంటూ’ కామెంట్లు పెడుతున్నారు. ‘ఒకవేళ అలాంటి చిత్రమే అయినప్పటికీ దాని వలన ఎటువంటి నష్టం జరగలేదు’ కదా అంటూ జోడించారు.. ‘ఒక ఆస్కార్ అవార్డు గ్రహీత నుంచి ఇంత తక్కువ స్థాయి మాటలు వస్తాయని మేము ఊహించలేదు. భాషతో సంబంధం లేకుండా వృత్తికి గౌరవం ఇవ్వాలి… దాని గురించి మీకు ఇష్టం లేకపోయినప్పటికీ ఇలా మాట్లాడటం సమాజసం కాదు’ అంటూ వ్యాఖ్యనించారు.
ఆర్ ఆర్ ఆర్ అభిమానులతో పాటు ఇతరులు కూడా ఆయన వ్యాఖ్యలు చాలా అసూయతో నిండి ఉన్నాయని, ఇది ఆయన స్థాయికి తగిన మాట కాదని పేర్కొన్నారు. అయితే ఈ చిత్రం విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలనే అందుకుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది..రెసూల్ పూకుట్టి బ్లాక్, సావరియా, ఎంథిరన్, రా.వన్, పుష్ప: ది రైజ్ , రాధే శ్యామ్ వంటి చిత్రాలకు పనిచేసిన సౌండ్ డిజైనర్. అతను 2009లో డానీ బాయిల్ స్లమ్‌డాగ్ మిలియనీర్‌లో చేసిన పనికి ఉత్తమ సౌండ్ మిక్సింగ్ కోసం ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు.