సిల్వర్ స్క్రీన్‌పై చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న. వీరిద్దరి మధ్య చక్కటి స్నేహ సంబంధాలున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వీరిద్దరి కామెంట్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ‘లైగర్’ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ శరీరంపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా పుష్ప గుచ్ఛాన్ని అడ్డుపెట్టుకొని కనిపిస్తున్నారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.. ఏ విషయంలోనైనా విజయ్ ముందుంటాడని, ధైర్యానికి మారుపేరని సమంత ప్రశంసించింది.
‘లైగర్’ పెద్ద విజయం సాధించాలని అనుష్క చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. తాజాగా ఈ ఫొటోపై రష్మిక మందన్న తనదైన శైలిలో స్పందించింది. ‘నీవు ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటావని అడిగితే..ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇక నుంచి నీ పేరే చెబుతా. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది. నీ సత్తా ఏమిటో ప్రపంచానికి చూపించు’ అని కామెంట్ పెట్టింది. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించారు. ‘గీత గోవిందం’ సినిమా నుంచి తనకు రష్మిక మందన్న స్ఫూర్తిగా ఉందని, ‘లైగర్’ మెరుపులను అందరూ చూడబోతున్నారని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. వీరిద్దరి కామెంట్స్ సానుకూల ధృక్పథంతో ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.