సోషల్ మీడియాలో అనసూయపై ట్రోలింగ్ కొత్త కాదు. ఎప్పటికప్పుడు నెటిజన్లు ఆమెపై విరుచుకుపడుతుంటారు. అనసూయ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇస్తుంది. ట్రోలింగ్స్ ను తిప్పికొడుతుంది. ఈసారి కూడా ఆమెపై ట్రోలింగ్ నడిచింది. ఎప్పట్లానే ఆమె డ్రెస్సింగ్ పై వస్తే పర్వాలేదు.. ఈసారి డ్రెస్సింగ్ తో పాటు.. లిప్ కిస్ పై విమర్శల పాలైంది అనసూయ. ప్రస్తుతం ఈమె హాలిడే ట్రిప్ లో ఉంది. చిన్న నిక్కరు వేసుకొని బీచ్ లో షికార్లు కొడుతోంది. తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భర్తకు శుభాకాంక్షలు చెబుతూ లిప్ కిస్ ఇచ్చింది.
భర్తకు లిప్ కిస్ ఇవ్వడంలో తప్పు లేదు కానీ.. ఈ వయసులో కూడా అంత ఓవరాక్షన్ అవసరమా అంటూ నెటిజన్లు అందుకున్నారు. ఆమె ధరించిన దుస్తులు, భర్తకు లిప్ కిస్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు పడుతున్నాయి. అయితే ఈసారి మాత్రం అనసూయ రెస్పాండ్ అవ్వలేదు. ఆమె తన వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకునే పనిలో ఉంది. ట్రోలర్స్ కు దూరంగా ఫన్ టైమ్ ను ఎంజాయ్ చేస్తోంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టీవీ కార్యక్రమాలతో పాటు సినిమాలు కూడా జోరుగా చేస్తోంది. ఆమె చేసిన దర్జా అనే మూవీ రేపోమాపో థియేటర్లలోకి రాబోతోంది. ఇక థ్రిల్లర్ కాన్సెప్ట్ తో, పూర్తిగా చీకట్లో తీసిన ఓ ప్రయోగాత్మక చిత్రం కూడా విడుదలకు సిద్ధమైంది. దీంతో పాటు ఎయిర్ హోస్టెస్ గా ఆమె నటిస్తున్న గ్రహం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఇలా రెండు చేతులా సంపాదిస్తోంది అనసూయ.