కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. `నేను శైలజ`తో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. ముఖ్యంగా ఈమె కెరీర్‌ను పీక్స్‌కు తీసుకెళ్లిన చిత్రం `మహానటి`. ఈ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందని కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. కానీ, సరైన హిట్టు మాత్రం కొట్టలేకపోయింది. ఈమె నుంచి చివరిగా వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న, గుడ్ లక్ సఖి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఇప్పుడు ఈ మలయాళ ముద్దుగుమ్మ ఆశలన్నీ `సర్కారు వారి పాట`పైనే పెట్టుకుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది..
మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ మూవీని నిర్మించగా.. తమనా స్వరాలు అందించారు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో కీర్తి సురేష్ ఎలాగైనా హిట్ అందుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఈ మూవీ టాక్ గనుక తేడా వస్తే.. స్టార్ హీరోలు కీర్తి సురేష్ పక్కన పెట్టే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఈ సినిమాతో కీర్తి సురేష్ కెరీర్ టర్న్ అవుతుందో..లేదో.. చూడాలి. కాగా, తెలుగులో కీర్తి సురేష్ సర్కారు వారి పాటతో పాటు నాని సరసన `దసరా`, చిరంజీవికి చెల్లెలుగా `భోళా శంకర్` చిత్రాలు చేస్తోంది.