ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో విభిన్న కథలు పుట్టుకొస్తున్నాయి. ప్రేక్షకులు అస్సలు ఊహించని కథలను దర్శకులు రాస్తున్నారు. ఇక అలాంటి పాత్రలే చేయాలి.. ఇలాంటి పాత్రలు చేయకూడదు అని కాకుండా ఛాలెంజింగ్ పాత్రలకు సై అంటున్నారు. వేశ్యా పాత్రలు ఏంటి. కండోమ్స్ గురించి చెప్పే కథలకు హీరోయిన్లు సైతం ఓకే అంటున్నారు. కండోమ్ అంటే ఒకప్పుడు వినడానికి కూడా ఆసక్తి కనపరచని జనం.. ఇప్పుడు దాని గురించి సినిమాలు తీస్తున్నా ఓకే అంటున్నారు.
ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ఒక సినిమాలో కండోమ్ టెస్టర్ గా కనిపిస్తున్న విషయం విదితమే. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ బరుచా కూడా కండోమ్ కు సంబంధించిన కథతో రెడీ అయిపోయింది. నుష్రత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జన్ హిత్ మే జారీ’. జై బసంతు సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మధ్యప్రదేశ్ లోని ఒక అమ్మాయి తన పట్టణంలో వీధి వీధి తిరుగుతూ కండోమ్ లు అమ్ముతూ జీవనం సాగిస్తుంది.
అయితే ఒక యువతి ఆలా కండోమ్స్ అమ్మడాన్ని తప్పుగా భావించి ఆమె , ఆమె కుటుంబం సామాజిక నిషేధానికి గురవుతారు. సామాజిక నిషేధం కారణంగా ఆ యువతి ఎదుర్కొనే అనేక సవాళ్ల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే కథ బాగానే ఉన్నా బయట కూడా ఈ పాత్ర చేస్తున్నందుకు అమ్మడు ట్రోల్స్ కి గురవుతుంది. అయితే ఆ కామెంట్స్ కు తను భయపడబోనని, ఇటువంటి టాపిక్ పై సినిమా తీయడానికి ధైర్యం కావాలని. అది తనకు ఉందని స్పష్టం చేసింది. మరి ఈ సినిమాతో ఈ హీరోయిన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.