in

here is the Truth about Balakrishna’s ‘surgery’ rumors!

నందమూరి బాలకృష్ణ మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో తిరుగుతోంది. ఆ ఫొటోలో బాలయ్య డాక్టర్లతో కలిసి ఉన్నారు. ఆయన మోకాలికి కట్టు ఉంది. కాలికి నిజంగా సర్జరీ జరిగిందా అన్న విషయం ఆ ఫొటోలో తెలియడం లేదు..కానీ, పలు మీడియా సంస్థలు కూడా వార్తని ప్రచురించాయి. దాంతో, బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం టీం ఒక ప్రకటన విడుదల చేసింది. “నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.

ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయ చేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు,” ఒక ప్రకటన వచ్చింది. బాలకృష్ణ ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స జరుపుకున్నారు. హీరోలు ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి మోకాళ్ళు, భుజాలు, మోచేతికి గాయాలు కావడం, అవి కొన్నాళ్ల తర్వాత తిరగబెట్టడం జరుగుతుంటాయి. అది సర్వసాధారణమే.

big surprise! Anushka Shetty playing cameo in ‘acharya’!

Rashmika Mandanna To Do Item Number For Vijay Deverakonda?