సమంత ఇన్ డైరెక్టుగా ఇన్‌స్టా పోస్టులు పెట్టడం, వ్యాఖ్యలు చేయడం తప్ప విడాకుల వ్యవహారంపై నేరుగా ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమెను ఈ విషయమై ప్రశ్నించడానికి మీడియాకు అవకాశం కూడా దక్కలేదు. ఐతే ఇప్పుడు సమంత సౌత్ మీడియా ముందుకు రాబోతోంది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి ఆమె నటించిన కణ్మణి రాంబో ఖటీజా సినిమా ప్రమోషన్ల కోసం సమంత రంగంలోకి దిగుతోంది. ఈ చిత్రం నెలాఖర్లో విడుదల కానుంది..
ఈ మధ్య ముంబయిలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న సమంతకు అక్కడ విడాకుల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. కష్టపడి సమాధానాలు దాటవేసింది. కానీ సౌత్ మీడియా ఆమెను అంత తేలిగ్గా వదలకపోవచ్చు. సమంత కూడా దీనికి ప్రిపరేయ్యే మీడియాను కలిసే ఛాన్సుంది. ఇప్పటిదాకా ఇన్ డైరెక్ట్‌గా విడాకుల విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన సామ్.. ఇప్పుడు మీడియా ముందు ఈ వ్యవహారంపై ఓపెన్ అయిపోతుందేమో, సంచలన విషయాలేమైనా చెబుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?