ఈమధ్యనే “బంగార్రాజు” సినిమాతో మంచి హిట్ అందుకున్న యువ హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయబోతున్న నాగచైతన్య ఇప్పుడు నందిని రెడ్డి డైరెక్షన్లో ఒక సినిమాకి సైన్ చేశారు. ఇంతకుముందు నందిని రెడ్డి డైరెక్షన్లో సమంత హీరోయిన్ గా నటించిన “ఓ బేబీ” సినిమాలో ఓ క్యామియో పాత్రలో కనిపించిన నాగచైతన్య ఇప్పుడు హీరోగా నందిని రెడ్డి తో చేతులు కలపనున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు, నందిని రెడ్డి మరియు బి.వి.ఎస్.రవి కలిసి ఈ చిత్ర కథను తయారు చేసినట్లు తెలుస్తోంది. స్వప్న సినిమా పతాకంపై కాకుండా వైజయంతి మూవీస్ పతాకంపై స్వప్న దత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరోవైపు “సర్కారు వారి పాట” ఫేమ్ డైరెక్టర్ పరశురామ్ తో కూడా నాగచైతన్య ఒక సినిమా చేయాల్సి ఉంది. వెంకట్ ప్రభుతో సినిమా తరువాత ఈ సినిమాని పూర్తి చేసి అప్పుడు నందిని సినిమా మొదలు పెట్టాలా లేక రెండు సినిమాలని ఒకే సారి పూర్తి చేయాలా అని నాగ చైతన్య ఇంకా నిర్ణయించుకోవాల్సి ఉంది.