in

“Welcome Aboard Bhai”, Salman Khan Joins Chiranjeevi’s ‘Godfather’!

మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ చేరింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ టీంలో చేరాడు. సల్మాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇటివలే సల్మాన్ షూటింగ్ లో పాల్గొనగా తాజాగా ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.” సల్మాన్ రాకతో ఉత్సాహం మరో స్థాయికి చేరింది. సల్మాన్ తో స్క్రీన్ పంచుకోవడం ఓ గొప్ప ఆనందం. సల్మాన్ స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు” అని ట్వీట్ చేశారు చిరంజీవి.

మలయాళంలో రూపొందిన `లూసీఫర్‌`కి రీమేక్‌ గా గాడ్ ఫాదర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయిక. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ బాగం కావడం స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతం తెలుగు సినిమాలు బాలీవుడ్ కూడా విడుదలౌతున్నాయి. ఇప్పుడు స్వయంగా సల్మాన్ గాడ్ ఫాదర్ లో కనిపించడంతో సహజంగానే సినిమాపై బాలీవుడ్ లో కూడా ఆసక్తి ఏర్పడుతుందని చెప్పాలి. తమన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Srikanth’s Son Roshan Name change By Numerology!

Actress Varalaxmi Sarathkumar clicks from her farmhouse!