in

Rashmika In Talks For A Special Song In Ranbir Kapoor Starrer?

గ‌త కొంత‌కాలంగా సౌత్ కంటే బాలీవుడ్ సినిమాల‌నే ఎక్కువ‌గా అంగీక‌రిస్తోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఆమె సినిమాల ఎంపిక తీరు చూస్తుంటే భవిష్యత్తులో బాలీవుడ్‌లోనే సెటిల్ అయ్యే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ‘పుష్ప‌-2’ మిన‌హా ఆమె చేతిలో వేరే సినిమాలు లేవు. ద‌క్షిణాదిలో ప‌లు భారీ అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నార‌ష్మిక ఆ సినిమాల్ని అంగీక‌రించ‌డం లేద‌ని తెలుస్తోంది..బాలీవుడ్ లో మాత్రం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

‘మిష‌న్ మ‌జ్ను’,‘గుడ్ బై’ సినిమాలు షూటింగ్ లు పూర్త‌వ్వ‌గా..వ‌రుణ్ ధావ‌న్ తో చేస్తున్న సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. తాజాగా ర‌ష్మిక హిందీలో మ‌రో భారీ చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో ర‌ణ‌భీర్ క‌పూర్ హీరోగా ‘యానిమ‌ల్’ పేరుతో బాలీవుడ్ ఓ సినిమా రూపొందుతోంది. డార్క్ కామెడీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెరకెక్కుతున్నఈ సినిమాలో అనిల్‌క‌పూర్‌, బాబీడియోల్‌,ప‌రిణీతిచోప్రా ముఖ్య పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఈ సినిమాలో కీల‌క సంద‌ర్భంలో వ‌చ్చే ఓ ప్ర‌త్యేక గీతం కోసం చిత్ర యూనిట్ ర‌ష్మిక మంద‌న్న‌ను సంప్ర‌దించిన‌ట్లు తెలిసింది..ఆమె నిర్ణ‌యం ఏమిట‌నేది ఇంకా వెల్ల‌డికానున్న‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ర‌ష్మిక అంగీక‌రిస్తే ఆమె కెరీర్ లో ఇదే తొలి స్పెష‌ల్ సాంగ్ అవుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ‘పుష్ప’ సినిమాలో స‌మంత ప్ర‌త్యేక‌గీతంలో ఆడిపాడింది. ఆ పాట పెద్ద హిట్ అయ్యింది. స‌మంత‌ను దృష్టిలో పెట్టుకొని ర‌ష్మిక ఈ స్పెషల్ సాంగ్ ను ఒప్పుకునే అవ‌కాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

Actress Varsha Hot Spicy Photos in Beach!

Allu Arjun meets Sanjay Leela Bhansali in Mumbai, Collab on cards?