in

Yami Gautam Joins with NGOs to Support Sexual Assault Victims!

యామీ గౌతమ్‌..ఫెయిర్ అండ్‌ లవ్లీ ప్రకటనతో అందరి మనసులు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడిన ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నితిన్‌ సరసన కొరియర్‌ బాయ్‌ కల్యాణ్‌, అల్లు శిరీశ్‌ సరసన గౌరవం, నువ్విలా చిత్రాలతో టాలీవుడ్ సినీ ప్రియులను అలరించిందీ అందాల తార. ఆతర్వాత హిందీ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి వరుస విజయాలు సాధించింది. ఇదిలా ఉంటే యామీ గౌతమ్ తాజాగా ఏ థర్స్​డే అనే సినిమాలో నటించింది.

ఈ చిత్రంలో అత్యాచార బాధితురాలి పాత్రలో యామీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా రీల్‌ లైఫ్‌ లో అత్యాచార బాధితులిగా నటించిన యామీ ఇప్పుడు రియల్‌ లైఫ్‌లో లైంగిక వేధింపుల బాధితులకు అండగా నిలిచేందుకు నడుం బిగించింది. వారికి పునరావాసం కల్పించడం కోసం మజ్లిస్​, పారి ( పీపుల్​ ఎగైనెస్ట్ రేప్​ ఇన్​ ఇండియా) అనే రెండు స్వచ్ఛంద సంస్థలతో చేతులు కలిపింది. ‘లైంగిక వేధింపుల బాధితుల పునరావాసానికి కృషి చేస్తున్న రెండు ఎన్‌జీవో‌లతో చేతులు కలిపినందుకు చాలా గర్వంగా ఉంది.

మహిళల భద్రత సమస్యల విషయంలో కొంత పురోగతి సాధించినప్పటికీ చేయాల్సింది మాత్రం చాలా ఉంది. స్వచ్ఛంద సంస్థలతో నా అనుబంధం ఇప్పుడే ప్రారంభమైంది. అయితే భవిష్యత్తులో.. అన్ని వర్గాల మహిళలను రక్షించడానికి అవసరమైన వసతుల కల్పనకు మరింత సహకారం అందించాలనుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది యామీ. కాగా లైంగిక వేధింపుల బాధితుల కోసం నడుంబిగించిన యామీపై ఆమె అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె లాగే ఆమె మనసూ అందమైనదంటూ కొనియాడుతున్నారు.

actress Priyanka Chopra in Miami Beach!

Shriya Saran reveals husband Andrei Koscheev had hernia surgery!