in

shocking: mohan Babu is not a collection king anymore

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు ప్ర‌ధాన పాత్ర‌లో ఇటీవ‌ల వ‌చ్చిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ సినిమాకు డైమండ్ బాబు ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఇళ‌యరాజా సంగీతం అందించారు. అయితే సన్ ఆఫ్ ఇండియా మూవీ అత్యంత చెత్త సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మ‌ధ్య కాలంలో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇంత‌టి భారీ ఫ్లాప్ అయిన సినిమా మ‌రొక‌టి లేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌లా నెగెటివ్ టాక్‌తో అతి పెద్ద డిజాస్ట‌ర్‌గా ఈ సినిమా నిలిచింది.

ఈ మూవీ ఆరంభం రోజునే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. కొన్ని చోట్ల మధ్యాహ్నం షోకే ప్రేక్ష‌కులు లేక షోల‌ను క్యాన్సిల్ చేశారు. అలగే కొన్ని థియేట‌ర్ల‌లో కేవ‌లం 2 నుంచి 3 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఆక్యుపెన్సీ న‌మోదు అయింది. ఈ క్ర‌మంలో ఈ సినిమాకు ఓపెనింగ్ రోజు కేవ‌లం రూ.6 ల‌క్ష‌ల గ్రాస్ మాత్ర‌మే రాగా.. మొత్తం రూ.35 ల‌క్ష‌ల క‌లెక్ష‌న్లు వ‌చ్చాయ‌ని తేల్చారు. దీంతో అత్యంత భారీ ఫ్లాప్‌ను, న‌ష్టాన్ని మూట‌గట్టుకున్న సినిమాగా ఈ మూవీ రికార్డుల‌కెక్కింది.

ఈ సినిమాను మోహ‌న్ బాబు సొంత బ్యాన‌ర్స్ అయిన శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్ ఫ్యాక్ట‌రీలు క‌ల‌సి సంయుక్తంగా తెర‌కెక్కించాయి. ప‌లు వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించామ‌ని మేక‌ర్స్ తెలిపారు. అయితే చాలా రోజుల త‌రువాత మోహ‌న్ బాబు పూర్తి స్థాయిలో నిడివి ఉన్న పాత్ర‌లో న‌టించారు. అయినా ఆయ‌న ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోయారు.

Amid Russian invasion, Samantha hails Ukraine’s President Zelensky!

Alia Bhatt first ever Indian heroine to take 20 crs remuneration?