భారతీయ చలన చిత్ర పితామహుడు దాదా ఫాల్కే గారికి తొలి నాళ్లలో ఎదురైనా చేదు అనుభవం. 1913 అయన నిర్మించిన రాజా హరిశ్చంద్ర చిత్రం లో స్త్రీ పాత్రలో నటించడానికి ఎవరు ముందుకు రాలేదు, ఫాల్కే గారు ఎన్నో విఫల ప్రయత్నాలు చేసారు, పత్రిక ప్రకటనలు ఇచ్చిన ఎవరు ముందుకు రాలేదు, చివరకు వేశ్య వాటికలకు వెళ్లి వేశ్యలను అడిగిన వారు కూడా విముఖత చూపటం తో గత్యంతరం లేక పురుషుడి చేత స్త్రీ పాత్ర వేయించారు. 1913 లో దాదా ఫాల్కే నిర్మించిన రెండవ చిత్రం అయిన ” మోహిని భస్మాసుర” చిత్రంలో పార్వతి పాత్రలో నటించడానికి దుర్గా బాయి కామత్ ముందుకు వచ్చారు.
సాంప్రదాయ మరాఠీ బ్రహ్మణ కుటుంబం లో జన్మించిన దుర్గా బాయి కామత్, కట్టుబాట్లను ఎదిరించి, ఎంతో సాహసం చేసి” మోహిని భస్మాసుర” చిత్రం లో పార్వతి పాత్ర పోషించారు. ఆవిడ కుమార్తె కమల బాయి తొలి బాల నటిగా అదే చిత్రంలో మోహిని పాత్ర పోషించటం మరో విశేషం. తన సాహసోపేత నిర్ణయం తో భారతీయ చలన చిత్ర మొట్ట మొదటి మహిళా నటిగా, తన కుమార్తె మొట్ట మొదటి బాల నటిగా చరిత్రలో నిలిచిపోయారు..