నటుడు సోనూ సూద్‌పై పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ రోజున ఆయన తన సోదరి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారన్న ఆరోపణలపై పోలీసులు నమోదు చేశారు..గత ఆదివారం పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ మోగా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.
అయితే లండేకే గ్రామంలో సోనూ పోలింగ్ రోజున తన సోదరి తరఫున ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. సోనూ సూద్ కారులో కూర్చుని ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను సోనూసూద్ ఖండించారు. ఓటర్లను పలువురు బెదిరిస్తున్నట్లు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నట్లు సమాచారం వచ్చిందని, అందుకే ఇంటి నుంచి బయటకు వచ్చానని సోనూ సూద్ చెప్పారు.