in

Anasuya to play Alice in Mammootty’s ‘Bheeshma Parvam’!

బుల్లితెర హాట్ యాంకర్‌ నుంచి వెండితెరపై నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు.మలయాళ సినిమా ‘భీష్మ పర్వం’ తో ఆమె మాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో అనసూయ ‘అలీస్’ పాత్రలో నటిస్తున్నారు. సినిమాలో తన లుక్‌కి సంబంధించిన ఫోటోను అనసూయ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కళ్లద్దాలు, పెదాలపై చిరునవ్వు, చీరకట్టులో అనసూయ లుక్ సింపుల్ అండ్ బ్యూటీఫుల్ అని చెప్పొచ్చు.

‘అలీస్’గా అనసూయ లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టితో నటించే అవకాశం కొట్టేశారు… అను ఇక తగ్గేదేలే…’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా అనసూయ ఇప్పటివరకూ పోషించిన పాత్రలకు అలీస్ విభిన్నంగా ఉండబోతుందనేది ఆమె లుక్‌ని బట్టి అర్థమవుతోంది.మమ్ముట్టి హీరోగా అమల్ నీరద్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా ‘భీష్మ పర్వం’ తెరకెక్కుతోంది.

సినిమాలో ‘భీష్మ వర్ధన్’ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో మమ్ముట్టి కనిపించబోతున్నారు. 1980ల్లో కొచ్చిలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ సీ చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా, సుశిన్ శ్యామ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 24, 2022న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Telugu Actress Ashima Narwal Stills in blue dress!

Disha Patani Reveals Acting Was never Her Dream!