ఉపాసన కొణిదెల..పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమెకు ఎనలేని గురింపు ఉంది. ఇక దానికి తగ్గట్టుగానే ఉపాసన చేపట్టే సామజిక కార్యక్రమాలు, సేవలు ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీతో భేటీ అయి టాక్ అఫ్ ది టౌన్ గా మారిన ఉపాసన తాజాగా మరో రికార్డ్ ని క్రియేట్ చేసి అందరిచేత శభాష్ అనిపించుకొంటుంది. ఉపాసన తాజాగా అరుదైన గౌరవాన్ని దక్కించుకొంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దుబాయ్ గోల్డెన్ వీసాను ఉపాసన దక్కించుకొంది.
ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ” ఇటీవల ప్రధాని మోదీతో ఇండియా ఎక్స్‌పో 2020 కార్యక్రమంలో పాల్గొన్నందుకు అనుకుంటా ఈ క్రిస్టమస్ కి నాకు మంచి బహుమతి దక్కింది. “వసుధైవ కుటుంబం” – ప్రపంచం ఒక కుటుంబం.. యూఏఈ గోల్డెన్ విసా పొందడం సంతోషంగా ఉంది. అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం, ప్రేమ కలిగిన భారతీయురాలిని .. అధికారికంగా నేను ఇప్పుడు గోల్డెన్ సిటిజన్ ని” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో అభిమానులందరూ ఉపాసనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.