in

Samantha to play The Stylish Spy In Her Next web Series!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత త‌న విడాకుల త‌ర్వాత స్పీడ్ పెంచేసింది. వ‌రుసగా సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తుంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా సినిమాలు, ఇంటర్ నేష‌న‌ల్ సినిమా తో బిజీ గా ఉన్న స‌మంత తాజా గా మ‌రో ప్రాజెక్టు కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన రాజ్ – డీకే ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న కొత్వ వెబ్ సిరీస్ లో స‌మంత గూఢ‌చారి పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ వెబ్ సిరీస్ గూఢ‌చ‌ర్యం సంబంధించిన క‌థాంశంతో తెర‌కెక్కుతుంద‌ని తెలుస్తుంది.

కాగ ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ దావ‌న్, స‌మంత ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఇద్ద‌రూ కూడా గూఢ‌చారి పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. కాగ వ‌రుణ్ దావ‌న్ తో స‌మంత మొద‌టి సారి న‌టిస్తుంది. అయితే ఈ వెబ్ సిరీస్ లో మొద‌ట స‌మంత‌, వ‌రుణ్ దావన్ క‌ల‌సి కొన్ని యాక్ష‌న్ సీన్ల షూటింగ్ ను జ‌రుపుతార‌ని తెలుస్తుంది. కాగ ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ సిరీస్ గా తెర‌కెక్కుతుంది. అలాగే నిర్మాతలు గా అవెంజ‌ర్స్ నిర్మాత‌లు రుస్స బ్ర‌ద‌ర్స్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

Kiara Advani to make her relationship with Sidharth Malhotra official?

these white dress stills of sonam kapoor will melt ur heart!