బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సోనాక్షి సిన్హా.. ‘దబాంగ్’ చిత్రంలో హీరోయిన్‌గా హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం పలు సనిమాల్లో నటించి.. మెప్పించింది. ఈ హట్ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ నెటిజన్ల మతిని పోగొడుతుంది. ఆమె ఎంత బొల్డ్‌గా ఉంటుందో.. అంతే నిర్మొహమాటంగా తన మనసులో ఏదీ దాచుకుండా బయట పెట్టేస్తుంది. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ తన రిలేషన్ షిప్, లవ్ ఎఫైర్స్‌పై ఓపెన్ అయిన సోనాక్షి స్కూల్ ఏజ్ నాటి సీక్రెట్ మొదలుకొని యంగ్ ఏజ్ రిలేషన్ వరకు అన్నీ బయటపెట్టేసింది.
మీరెప్పుడైనా ఎవ్వరితోనైనా రిలేషన్ షిప్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా.. స్కూల్లో ఉన్నప్పుడే ఒక అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నానని, అయితే అది అంత పెద్ద రిలేషన్ షిప్ కాదని సోనాక్షి తెలిపింది . 21, 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించానని, ఆ వ్యక్తితో ఐదేండ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్నానని తెలిపింది. ప్రతి రిలేషన్ నుండి మనం కొత్త విషయాలను నేర్చుకుంటామని, ప్రేమించే వ్యక్తులను వెతుక్కుంటామని, వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయని సోనాక్షి పేర్కొంది.