టాలీవుడ్ సినిమా పరిశ్రమ కష్టాలను పట్టించుకోవాలంటూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున కూడా వీరితో చేరిపోయారు. నిన్న జరిగిన “లవ్ స్టోరీ” సక్సెస్ మీట్ లో నాగ్ మాట్లాడారు. ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్ తరువాత బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టింది. నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషించిన ‘లవ్ స్టోరీ’ని శేఖర్ కమ్ముల రూపొందించారు. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను మేకర్స్ నిన్న హైదరాబాద్‌లో నిర్వహించగా,
ఈ కార్యక్రమానికి నాగార్జున అక్కినేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తన ప్రసంగంలో నాగార్జున బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా డ్రీమ్ రన్ గురించి మాట్లాడారు, చిత్ర తారాగణం, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలోనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేశారు. “తెలుగు వారికి తెలుగు సినిమా అంటే విపరీతమైన ప్రేమ. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒకే ఒక విన్నపం. మమ్మల్ని ఆశీర్వదించమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నాను” అని నాగార్జున తన ప్రసంగాన్ని ముగించే ముందు చెప్పారు.