in

i am not a virgin, says big boss sarayu!

యూట్యూబ్ వీడియోల‌తో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న సర‌యు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మ‌రింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర‌వాత స‌ర‌యు ఒక్క వారానికే బ‌య‌ట‌కు రావాల్సివ‌చ్చింది. ఇక బిగ్ బాస్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర‌వాత మాత్రం స‌ర‌యు ఇంట‌ర్య్వూల‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్ ల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇక తాజాగా ఓ ఇంట‌ర్య్వూలో స‌ర‌యు త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్లు చేసింది.

తాను ఏడేళ్ల‌పాటు ఓ వ్య‌క్తితో డేటింగ్ లో ఉన్నాన‌ని స‌రయు వ్యాఖ్యానించింది. అత‌డితో రిలేషన్ షిప్ పెళ్లి వ‌ర‌కూ వ‌చ్చిందని కానీ మొద‌ట క‌ట్నంగా 25 ల‌క్ష‌లు అడిగార‌ని ఆ త‌ర‌వాత అర‌కోటి..కోటి రూపాయలు అడిగార‌ని చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడే ఇలా ఉంటే పెళ్లి త‌ర‌వాత ఇంకెలా ఉంటుందో అని నీకు నాకు సెట్ కాద‌ని తేల్చిచెప్పాన‌ని స‌ర‌యు వెల్ల‌డించింది. అంతే కాకుండా తాను వ‌ర్జిన్ కాద‌ని అత‌డితో ఏడేళ్లు రిలేష‌న్ షిప్ లో ఉన్నాన‌ని స‌ర‌యు త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు ఓపెన్ గా చెప్పేసింది.

political party bali teesukunna natudu sudhakar cini jeevitham!

Shahid Kapoor reveals Nani made him cry!