in

yeppudo jaragalsina deepika padukone tollywood entry!

దీపిక పదుకొణె.. ఇటీవలే టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో నాయికగా ఎంపిక కావడమే ఇందుకు కారణం. సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ సరసన ఆడిపాడబోయేది ఎవరా అనే ఉత్కంఠకు తెరదించుతూ ఈ అమ్మడి పేరు ప్రకటించారు దర్శక-నిర్మాతలు. దాంతో సినీ అభిమానుల్లో అంచనాలు పెరగడం మొదలైంది.

హిందీలో గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే నాయికా ప్రాధాన్య చిత్రాల్లో నటించి శెభాష్‌ అనిపించుకున్న ఈ భామ తొలిసారి తెలుగు చిత్రం ఖరారు చేయడంతో అందరి చూపు ఆమెవైపు నిలుస్తోంది. ఇప్పుడే కాదు గతంలోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది దీపికకు. అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు.  జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్‌ 4 యు’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో నర్తించింది దీపికా. అయితే ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

ismart beauty nabha natesh charming stills!

confirmed, Sai Pallavi To Star In A Web Series Next!