in

Nabha Natesh bags a chance to act with Hrithik roshan!

పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఈ సినిమాలో తెలంగాణ యాసలో నభా పలికిన మాస్‌ డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక అందంతో పాటు అభినయంతో ఆకట్టుకున్న ఈ చిన్నది ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నభా మళ్లీ ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది..

అయితే విజయం సొంతం చేసుకోకపోయినా ఆఫర్లు మాత్రం క్యూ కడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడు తాజాగా మరో లక్కీ ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ది నైట్‌ మేనేజర్‌ అనే టీవీ సిరీస్‌ను బాలీవుడ్‌ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరగుతున్నాయి. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ ఈ సిరీస్‌ను తెరకెక్కించే పనిలో పడింది. ఇక ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకరైన హృతిక్‌రోషన్‌ లీడ్‌ రోల్‌లో నటించనున్నారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హృతిక్‌కు జోడిగా నభా నటేష్‌ నటించనుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియాలో ఈ వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకవేళ ఈ వార్తే కనుక నిజమైతే నభా దిశ మారినట్లే. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్ బాట పట్టిన అతికొద్ది మంది హీరోయిన్లలో నభా చోటు దక్కించుకున్నట్లు అవుతుంది.

divi expressed her interest on dating with prabhas!

milky beauty looks captivating in saree!