లాక్డౌన్ సమయంలో మూగజీవాలని కాపాడే బాధ్యత తీసుకుంది రష్మీ. కుక్కలు, పావురాలు, ఇతర మూగ జీవాలకు ప్రతి రోజు ఆహారం అందించేవారు. అలానే నిరుపేదలకు కూడా సాయం అందించింది. అయితే మూగ జీవాలకు అన్యాయం జరుగుతుందనే విషయం తన దృష్టికి వస్తే వెంటనే స్పందిస్తూ ఉంటుంది. ‘సేవ్యానిమల్స్ఇండియా’ అనే ట్విటర్ ఖాతా ద్వారా ఓ నెటిజన్ కొంతకాలంగా ట్విటర్లో బాధిత కుక్కల ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు.
దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని పేర్కొన్నారు. హైదరాబాద్లో వీధి కుక్కల సంతతిని తగ్గించేందుకు వాటికి ఆపరేషన్లు చేస్తున్నారు. ఐతే ఆపరేషన్ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే అలాగే రోడ్డుపై వదిలేస్తున్నారు. చాలా కుక్కలకు గాయాలు మానక అల్లాడిపోతున్నాయి అని ఆయన పేర్కొననారు. ఈ విషయంపై రష్మీ తన ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ సాయం కోరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కలకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) ఆపరేషన్ చేసి అలాగే వదిలేస్తున్నారని..దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ కార్యాలయం ఖాతాతో పాటు కేటీఆర్ వ్యక్తిగత ట్విటర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ రష్మీ గౌతమ్ ఓ ట్వీట్ చేశారు. ఉన్నతాధికారులు విధించిన టార్గెట్ కోసం ఇష్టం వచ్చినట్టు ఆపరేషన్స్ చేసి రోడ్డుపై పడేస్తున్నారు. నోరులేని జీవాలని ఇలా హింసించడం సరికాదు అని పలవురు నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.