in

natural star’s unnatural comments on cinema theatres!

సినిమా థియేటర్లపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిమ్మరుసు సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన నాని.. థియేటర్ల విషయంలో చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సంచలనంగా మారాయి. సినిమా అనేది మన కల్చర్‌.. థియేటర్‌లోకి వెళ్లి సినిమా చూడటం అనేది మన బ్లడ్‌లోనే ఉంది. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు.. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని విమర్శించారు..సినిమా అంటేనే చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. రెస్టారెంట్లు, పబ్స్‌ ఇతర ప్రదేశాల కన్నా థియేటర్‌ చాలా సేఫ్‌..

కానీ వాటినే ముందు మూస్తారు, లాస్ట్‌లో తెరుస్తారు అంటూ వ్యాఖ్యానించారు. నేను ఒక ప్రేక్షకుడి గా చెపుతున్నాను. మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ ఏది లేదు. థియేటర్ వ్యవస్థ మీద ఆధార పడి కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. వాళ్లంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే థియేటర్ వ్యవస్థ నాశనం అవుతుందని నాని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు.

Saloni Long Hair Stills In White Dress!

SR Kalyanamandapam Trailer, Kiran Abbavaram, Priyanka Jawalkar!