RRR సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. రాజమౌళి తండ్రి, రచయిత కె.వి. విజయేంద్రప్రసాద్.. ఎన్టీఆర్ పాత్రకు ముస్లిం పెట్టడంపై వివరణ ఇచ్చారు..ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియో విడుదలైనప్పుడు ఆయన ముస్లిం గెటప్‌లో కనిపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది చరిత్రకారులు భీమ్‌కు ముస్లిం టోపీ పెట్టడంపై మండి పడ్డారు. భీమ్ వారసులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై ఆంగ్ల మీడియాతో మాట్లాడిన విజయేంద్రప్రసాద్ ..
‘‘భీమ్‌ను పట్టుకోవాలని నైజాం ప్రభువులు ప్రయత్నించారు. వెంటాడారు. నైజాం పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆ విధంగా చేశాడు. ముస్లిం యువకుడిగా మారాడు’’ అన్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రామ్‌చరణ్‌ను పోలీస్‌గా చూపించడానికి ఓ కారణం ఉందని, వెండితెరపై ప్రేక్షకులకు అది సర్‌ప్రైజ్ ఇస్తుందని ఆయన అన్నారు. ఇద్దరు స్టార్స్‌తో సినిమాలు చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్న తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్’ కథ రాశారట. ‘‘ఎన్టీఆర్, రామ్‌చరణ్ స్టార్ ఇమేజ్‌ను, అంచనాలను దృష్టిలో పెట్టుకుని కథ రాశాం’’ అని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.