in

Mehreen pirzada trashes Rumors About Balayya!

కృష్ణగాడి వీరప్రేమగాథ’ ‘మహానుభావుడు’ ‘ఎఫ్‌-2’ చిత్రాలు ఈ పంజాబీ సొగసరికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కొన్ని మాసాల క్రితం హరియాణాకు చెందిన భవ్యా బిష్ణోయ్‌తో మెహరీన్‌ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాదే ఈ వయ్యారి పెళ్లిపీటలెక్కబోతున్నట్లు తెలిసింది. నిశ్చితార్థం అనంతరం సినిమాల ఎంపికలో సెలక్టివ్‌గా ఉంటోంది మెహరీన్‌. తెలుగులో ‘ఎఫ్‌-3’తో పాటు మరో సినిమాలో నటిస్తోంది. అయితే తన తదుపరి సినిమాల గురించి..

సోషల్‌మీడియాలో అసత్య వార్తలు ప్రచారమవుతున్నాయని మెహరీన్‌ చెప్పింది. టాలీవుడ్‌లో తాను కొత్త సినిమాలకు సంతకం చేయలేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్‌ అంగీకరిస్తే తానే స్వయంగా తెలియజేస్తానని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె ఓ ట్వీట్‌ చేసింది. ‘నా సినిమాల తాలూకు ఏ వార్తల్ని నమ్మకండి. ఆ విషయాల్ని నేనే స్వయంగా మీతో పంచుకుంటా. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించింది..

ashima narwal cute and hot closeup clicks!

37 years for MAHANAGARAMLO MAYAGADU!