టీవీ రంగంలో తీరిక లేకుండా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి నటనకు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుక్కారణం తనకు కొడుకు పుట్టడమే. ఫిబ్రవరిలో మగ బిడ్డకు జన్మనిచ్చిన అనిత.. కొన్ని నెలల తర్వాత నటనలోకి పునరాగమనం చేస్తుందనుకున్నారు. కానీ తాను ఇక తన సమయాన్ని తన బిడ్డకే కేటాయించాలనుకున్నట్లు ఆమె ప్రకటించింది. భవిష్యత్తులో నటనలోకి తిరిగొస్తానో లేదో కూడా చెప్పలేని ఆమె పేర్కొంది. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇండస్ట్రీకి దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో మా బాబు సంరక్షణ చూసుకోవడం నాకెంతో అవసరం. అందుకే ఇకపై సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. భవిష్యత్తులో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడతానా లేదా అని ఇప్పుడు ఆలోచించట్లేదు. మళ్లీ రావాలనుకుంటే మాత్రం చెబుతాను అని అనిత పేర్కొంది..