ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అప్పుడు తమ్ముడు. ఇప్పుడు అన్నతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. డైరెక్టర్ కార్తీక్ వర్మ దర్శకత్వంలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా అప్డేట్ ప్రకారం అధిక బడ్జెట్తో ఈ చిత్రాన్ని సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం మేకర్స్ కృతిశెట్టిని సంప్రదించినట్లు టాక్.
కృతి శెట్టి ‘ఉప్పెన’ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ తో కలిసి రొమాన్స్ పండించింది. మరిప్పుడు అన్న సాయి ధరమ్ తేజ్ తో కలిసి కన్పించబోతుందా ? లేదా ? అన్నది చూడాలి. ప్రస్తుతం కీర్తి సురేష్ ఖాతాలో దాదాపు నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.