ఈ మద్య ఈజీ మనికి అలవాటు పడ్డవారు చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఎదుటి వారి బలహీనతలే ఇలాంటి కేటుగాళ్లకు పెట్టుబడి. ఈ మద్య సైబర్ నేరగాళ్ల దోపిడీ మరీ ఎక్కువైపోతుంది. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా కరోనా కష్టకాలంలో పేద ప్రజలకు నేనున్నా అంటూ ముందుకు వచ్చిన అభినవ కర్ణుడు సోనూ సూద్ ని కూడా వదల్లేదు కేటుగాళ్లు. ఆయన పేరుతో డబ్బు వసూళ్లకు దిగారు.
ఈ విషయాన్ని స్వయంగా సోనూసూదే తెలియజేశాడు..కరోనా కష్టకాలంలో.. ఎంతో మందికి సాయం చేసేందుకు సూద్ ఫౌండేషన్ ను సోనూ ఏర్పాటు చేశాడు. మామూలు ప్రజలే గాక సారా అలీ ఖాన్ లాంటి స్టార్లు కూడా ఈ ఫౌండేషన్ కు విరాళాలు ఇస్తున్నారు. అయితే సోనూ సూద్ ఫౌండేషన్ పేరిట పలు నకిలీ లింకులు వెబ్ లో చక్కర్లు కొడుతున్నాయి. సోనూ సూద్ ఫౌండేషన్ అంటూ తమ నంబర్లు ఇచ్చి విరాళాలను కొట్టేయాలని కేటుగాళ్లు ప్లాన్ వేశారు.