1969 లో నిర్మాత గోపాల కృష్ణ నిర్మించిన చిత్రం ” కధానాయకుడు” ఇందులో హీరో యెన్.టి.ఆర్. మరియు హీరోయిన్ జయలలిత. ఈ చిత్రం రాజకీయ నేపధ్యం తో నిర్మించిన చిత్రం, ఆ తరువాతి కాలంలో యెన్.టి.ఆర్., జయలలిత ఇద్దరు ముఖ్య మంత్రులు అయ్యారు. ఈ చిత్ర నిర్మాణం పూర్తి అయిన సందర్భం లో నిర్మాత గోపాలకృష్ణ, చాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి కి ఫియట్ కార్ గిఫ్ట్ గ ఇచ్చారు. ఎందుకో తెలుసా ? చిత్ర నిర్మాణం చివరి దశ లో ఉన్నపుడు కొంత ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది, చిత్రం విడుదల తేదీ ప్రకటించేసారు నిర్మాత, ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేయడానికి యెన్.టి.ఆర్., జయలలిత ఒక్క రోజు కాల్ షీట్ ఇచ్చారు, అదే రోజు అప్పటి తమిళ నాడు ముఖ్య మంత్రి అన్నా దురై మరణించారు, షూటింగ్ కాన్సల్ అయింది, ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 6 తారీకు జరిగాయి, ఆ రోజు షూటింగ్ పెట్టుకున్నారు, యెన్.టి.ఆర్. మేక్ అప్ తో సిద్ధం గ ఉన్నారు..
అంత్యక్రియలలో పాలుగొన్న జయలలిత గారు మధ్యాహ్నం వచ్చారు స్పాట్ కి, గోపాలకృష్ణ గారికి ఎంతో టెన్షన్, దాదాపు గ 59 షాట్స్ చేయవలసి ఉంది, ఆ రోజు తప్పితే మళ్ళీ నెల రోజుల వరకు యెన్.టి.ఆర్. కాల్ షీట్ లేదు, అప్పుడు గోపాలకృష్ణ గారు ఛాయాగ్రాహకుడు వి.ఎస్.ఆర్. స్వామి ని పిలిచి మీరేం చేస్తారో తెలియదు, ఎంత లేట్ అయిన పరవాలేదు ప్యాచ్ వర్క్ అంత కంప్లీట్ చేసేయాలి, ఆలా చేస్తే మీకు ఫియట్ కార్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారట, అంతే స్వామి గారు రెట్టించిన ఉత్సాహం తో రాత్రి పన్నెండు వరకు షూట్ చేసి వర్క్ మొత్తం పూర్తి చేసారు. అనుకున్నట్లుగానే 1969 ఫిబ్రవరి 27 న సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది, చెప్పినట్లుగానే గోపాలకృష్ణ గారు, వి.ఎస్.ఆర్. స్వామి కి ఫియట్ కార్ గిఫ్ట్ గ ఇచ్చారు. ఈ చిత్రం విజయ నాగి రెడ్డి గారు 1969 లోనే తమిళం లో” నమ్మ నాడు ” అనే పేరుతో ఏం.జి.ఆర్. తో నిర్మించారు, ఆ తరువాతి కాలం లో అయన కూడా తమిళ నాడు చీఫ్ మినిస్టర్ అయ్యారు.