in

uppena beauty to romance ‘red’ star ram in his next!

బుచ్చిబాబు సానా ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన చిత్రం `ఉప్పెన‌`. వైష్ఱ‌వ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్‌లుగా ప‌రిచ‌య‌మైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంతో క‌న్న‌డ భామ కృతిశెట్టి కి వ‌రుస ఆఫ‌ర్లు ప‌ల‌క‌రిస్తున్నాయి. `ఉప్పెన‌` రిలీజ్‌కి ముందే నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న `శ్యామ్ సింఘ‌రాయ్‌`లో అవ‌కాశం ద‌క్కించుకున్న కృతి శెట్టి తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్‌ని సొంంత చేసుకున్న‌ట్టు తెలిసింది.

ఎన్‌. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. గురువారం ఈ ప్రాజెక్ట్‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు మేక‌ర్స్ శ్రీ‌నివాస్ చిట్టూరి. రామ్  19వ చిత్రంగా తెర‌కెక్క‌నున్న ఈ మూవీలో హీరోయిన్‌గా కృతిశెట్టి ని ఫైన‌ల్ చేసిన‌ట్టు తెలిసింది. గ‌త కొన్నేళ్లుగా తెలుగులో స్ట్రేయిట్ మూవీ చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న లింగుస్వామి ఎట్ట‌కేల‌కు తెలుగులో రామ్‌తో సినిమా చేయ‌బోతున్నారు. మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నుంద‌ని తెలిసింది.

anchor Anasuya to play a prostitute in her next!

Kapatadhaari!