దర్శకుడు క్రిష్ జగర్లాముడితో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఏం.ఎం. రత్నం అత్యతం భారీ స్థాయిలో నిర్మిస్తున్ప ఈ చిత్రాన్ని చారిత్మక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఓ యోధుడి కథకు ఫాంటసీ అంశాల్ని జోడించి 17వ శతాబ్దం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో చిత్రీకరణ పునః ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ఆసక్తికరమైన అంశం ఒకటి బయటికి వచ్చింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం చార్మినార్ సెట్‌ని రూపొందించినట్టు తెలిసింది.
ఇది ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనుందట. ఈ ఐకానిక్ స్ట్రక్చర్ చార్మినార్ భారీ సెట్‌ను ‘సైరా’ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ ఈ సెట్ కోసం పనిచేస్తున్నారు. ఈ సెట్ 17 వ శతాబ్దపు వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతున్నారు. ఈ సెట్లో నే ఈ మూవీ కోసం భారీ షెడ్యూల్ ని చిత్రీకరించబోతున్నారు. రాబోయే నెలల్లో ఈ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఈ సెట్ కోసం మేకర్స్ భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరుకున్నాయి.