in

koratala siva fires on ‘acharya’ copy allegations!

మెగాస్టార్ చిరంజీవి తో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య.  ఈ సినిమానుంచి మోషన్ పోస్టర్ ఇటీవల విడుదలై విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమా స్టోరీ తనదే అని రాజేష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. ఇది ఎవరి స్టోరీ కాదని ఇది తన సొంతంగా రాసుకున్న కథ అంటూ శివ తెలిపారు. ఇదే విషయం పై ఎన్టీవీలో జరిగిన డిబేట్ లో కొరటాల శివకు రాజేష్ అనే వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. దేవాలయాల భూములపై నేను రాసుకున్న కథను కొరటాల తీస్తున్నారని రాజేష్ వ్యక్తి  ఆరోపిస్తున్నారు. ‘అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి మొదటిగా నా కథను వినిపించా.. నేను చూసిన నిజ జీవిత కథల ఆధారంగా స్టోరీ రాసుకున్నా.. ఆ కథను మైత్రి మూవీస్ కు వినిపించాను. నా పై అంత బడ్జెట్ పెట్టలేక ఆ కథను కొరటాల కు ఇచ్చి చేయిస్తున్నారు” అంటూ రాజేష్ ఆరోపిస్తున్నాడు.

ఒక వేళ ఇది నా కథకాకపోతే నేను క్షమాపణ చెప్తా.. అని రాజేష్ అన్నాడు.  దానికి కొరటాల వివరణ ఇస్తూ ‘మీరు రాసుకున్న కథ వేరు.. నా కథ వేరు. సోషల్ ఇష్యుస్ పై ఎవరికీ తోచిన విధంగా వారు కథలు రాసుకుంటూ ఉంటారు’. ‘ఇది రాజేష్ రాసుకున్న కథ కాదు .ఇది నేను రాసుకున్న కథ . షూటింగ్ దశలో ఉన్న సినిమా స్టోరీ నేను ఎలా చెప్పగలను . ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరికి నేను కథలు వినిపించుకుంటూ పోవాలా ..? అని శివ అన్నారు. ‘నేను కో డైరెక్టర్ ద్వారా కథ తెలుసుకొని నేను మాట్లాడుతున్నా… ఇది ఖశ్చితంగా నా కథే అని అన్నారు రాజేష్. దాంతో కొరటాల శివ మండిపడ్డారు. ‘నా కోసం పనిచేసే నా మనుషులు కథను ఎలా బయటకు చెప్తారు .. ఇది మొత్తం అసత్యారోపణలు అని అన్నారు .ఆచార్య సినిమా కథ అతను చెప్పే కథ ఒకటి కాదు అని ఎన్నిసార్లు చెప్పినా అతను వినడంలేదు. దాంతో కొరటాల ఈ విషయం పై కోర్టుకు వెళ్తా అని అన్నారు. తన సినిమా పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని కొరటాల అన్నారు. అంతే కాకుండా చిరంజీవి దృష్టికి కూడా ఇది తీసుకువెళ్తానని అన్నారు.

mahesh babu to work with his flop director again?

clarity on kajal engagement!