in

hansika gave clarity on balloon business!

హీరోయిన్స్‌ అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్‌ గా చేస్తూ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మనం గతంలో చూసేవాళ్లం.కాని ఇప్పుడు హీరోయిన్స్‌ అలా కాదు. అవకాశాలు తగ్గుముఖం పడుతున్న సమయంలోనే బిజినెస్‌ లోకి అడుగులు పెడుతున్నారు.తమకున్న క్రేజ్‌ తో వ్యాపారాల్లో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఎవరికి తోచిన బిజినెస్‌ లో వారు అడుగు పెడుతున్నారు.ఇక హీరోయిన్‌ దేశముదురు బ్యూటీ హన్సిక బెలూన్స్ వ్యాపారం చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈమధ్య కాలంలో ఈమె సన్నిహితులు మరియు మిత్రుల ఇంట్లో జరుగుతున్న వివాహాది శుభకార్యాలు మరియు పుట్టిన రోజు వేడుకలకు బెలూన్స్‌ సరఫరా చేస్తోంది.ఈ విషయంలో పలువురు పలు రకాలుగా ప్రచారం చేస్తున్నారు.అయితే బెలూన్స్‌ బిజినెస్‌ గురించి వస్తున్న వార్తలను ఆమె ఖండించింది.తనకు ప్రస్తుతానికి వ్యాపారం చేసేంత సమయం లేదని చెప్పుకొచ్చింది. నేను ఈ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయాలో నాకు అర్థం అవ్వడం లేదు.నా గురించి నేను చేస్తున్న బిజినెస్‌ గురించి ఇంతగా మీడియా వారు ఆలోచించడం ఆశ్చర్యంగా ఉంది.

nabha natesh reveals her crush!

mahesh babu to work with his flop director again?