నన్ను దోచుకుందవటే చిత్రంతో పరిచయమైన నభా నటేష్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారును హీటెక్కించింది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్‌కు నభా బాగా దగ్గరైంది. ఇక ప్రస్తుతం ఈ ఇస్మార్ట్ పోరి.. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన రెండు పాటల్లో నభా ఓ రేంజ్లో అదరగొట్టింది. సాధారణంగా కొందరు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ప్రేమలో పడతారు.
కొందరు ఇండస్ట్రీలోకి రాకముందే ప్రేమలో పడతారు. అయితే నభా కాలేజ్ రోజుల్లోనే ఓ హీరోను ప్రేమించాను అంటూ ఓపెన్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నభా.. గతంలో తను ఇష్టపడిన హీరో గురించి మాట్లాడింది. `చిన్నప్పటి నుంచి నన్ను బాగా ఆకర్షించిన హీరో షారూక్ ఖాన్. షారుక్ ఖాన్ అనే నాకు ఎంతో ఇష్టం. ఆయన నటించిన కుచ్ కుచ్ హోతా హై సినిమాను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. కాలేజ్ రోజుల్లో షారూక్‌ను ఎంతగానో ప్రేమించానని.. ఇప్పుడు కూడా ఆయన మీద ఇష్టం ఉంది అంటే.. నేను ఆయనను లవ్ చేస్తుండటమే` అంటూ నభా చెప్పుకొచ్చింది.