సోషల్‌మీడియా వేదికలపై పరస్పరం దూషించుకునే ధోరణులు పెరిగిపోతున్నాయని, మనుషుల్లో అంతటి ద్వేషభావం ఎందుకని ప్రశ్నించింది మిల్కీబ్యూటీ తమన్నా. కరోనా సంక్షోభం వల్ల ప్రపంచ పౌరులందరూ మానసికమైన కుంగుబాటుకు లోనై ఉన్నారని..వారికి మనోైస్థెర్యాన్ని అందించే సాంత్వన వచనాలు కావాలని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘ఏ ఆన్‌లైన్ వేదికలో చూసినా ప్రతికూల భావాల్ని పెంచే ప్రచారమే ఎక్కువగా జరుగుతోంది.
నేడు ప్రపంచమంతా వేదనలో ఉంది. ఈ సమయంలో చదువుకున్న వాళ్లు, సమాజంలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రజల్లో ఆశావాహదృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నాలు చేయాలి. సోషల్‌మీడియాను పాజిటివ్ ఆలోచనల వేదికగా తీర్చిదిద్దాలి. కరోనా సంక్షోభం తొలగిపోయేవరకైనా స్నేహభావంతో ఉండాలి’ అని చెప్పింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాను పాజిటివ్‌గా ఆలోచిస్తానని, సోషల్‌మీడియాలో తాను ఇప్పటివరకు ద్వేషంతో కూడిన ఒక్కపోస్ట్‌ను కూడా పెట్టలేదని తమన్నా పేర్కొంది.