in

eesha rebba twitter account hacked!

అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర అంత ఆదరణ రాలేదు. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. గతేడాది త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది.ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఈమె తన ఫొటో షూట్స్ మరియు ఇతరత్ర విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. ట్విట్టర్ లో ఈమె భారీగానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఇక ఈ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో ఈషా రెబ్బా తెలిపింది. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అకౌంట్ లేదు అనే మెసేజ్ వస్తుందని పేర్కొంది. ఈ మధ్య చాలా మంది సెలబ్రెటీల ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఇప్పుడు ఈషా రెబ్బా అకౌంట్ హ్యాక్ అయ్యింది.

audience shows no interest in ‘thriller’!

latest update on spb’s health condition!