in

a village set for lovers!

నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో లవ్ స్టోరీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. కరోనా ఎఫెక్ట్ తో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్‌..అక్టోబర్ మూడో వారంలో తిరిగి షురూ కానున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీ లో ప్రత్యేకంగా ఓ విలేజ్ సెట్ ను వేయిస్తున్నాడట శేఖర్ కమ్ముల. ఈ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్‌. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే వెయిట్ చేయాలి. ఇద్దరు డ్యాన్సర్ల జీవన శైలిని తెలిపే విధంగా లవ్ స్టోరీ సినిమా కథ సాగనుందని ఇన్ సైడ్‌టాక్‌.

tejaswi sets social media on fire!

balakrishan’s son entry into movies!