in

nilambhari pathranu cheyoddhani anukunna ramyakrishna!

కేవలం హీరోయిన్ గానే కాకుండా పవర్ ఫుల్ పాత్రలలో కూడా నటించి తనకు తానే సాటి అని నిరూపించుకుంది రమ్యకృష్ణ.. బాహుబలిలో శివగామీ పాత్రలో నటించి ఆ సినిమా సక్సెస్ కి మెయిన్ పిల్లర్ గా నిలిచారు. అయితే ఈ రమ్యకృష్ణకి ముందుగా నటిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం నరసింహ… రజినీకాంత్, సౌందర్య హీరోహీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రమ్యకృష్ణ నిలంబరి అనే పవర్ ఫుల్ పాత్రలో నటించింది. రజినీకాంత్ కి ఎక్కడ కూడా తగ్గకుండా ఆమె నటన ఈ సినిమాలో ఉంటుంది. అయితే ఈ సినిమాలోని నీలాంబరి పాత్రను ముందుగా చేయొద్దు అని అనుకున్నారట రమ్యకృష్ణ..

దర్శకుడి బలవంతం మేరకే ఆ పాత్రకి ఒప్పుకున్నట్లు రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఒకవేళఆ సినిమాలో నీలాంబరి పాత్ర కావాలా లేకా సౌందర్య పాత్ర కావాలా అని తనను దర్శకుడు అడిగి ఉంటే తాను కచ్చితంగా సౌందర్య పాత్రనే ఎంచుకునేదాన్నని రమ్యకృష్ణ వెల్లడించింది. అంతేకాకుండా ఈ చిత్రంలో నేను సౌందర్య ముఖంపై కాలు పెట్టే సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఇబ్బందిపడ్డానని, కానీ దర్శకుడిని నమ్మి ఆ సన్నివేశం పూర్తి చేయగలిగానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తరవాత రమ్యకృష్ణ స్టార్ ఇమేజ్ మరింతగా పెరిగింది. వరుస అవకాశాలు ఆమెకి వచ్చాయి.

Silence Mean Trisha’s Marriage is Confirmed?

milky beauty workouts in rain!