in

shruthi haasan to start a youtube channel!

‌మ‌ల్ హాస‌న్ కూతురుగా కాకుండానే త‌న‌కంటూ సినీ ఇండ‌స్ట్రీలో పేరు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ అయింది శృతి హా స‌న్‌. మొద‌టిలో టెక్నిక‌ల్ యూనిట్‌తో క‌లిసి ప‌ని చేసిన శృతి ఆ త‌రువాత హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా త‌న కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే.. తెలుగు, త‌మిళంలో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది శృతి. అయితే వ‌ర‌స‌గా సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే స‌డ‌న్ బ్రేక్ ఇచ్చి ఇండ‌స్ట్రీకి దూర‌మైన ఈ భామ‌.. ఇటీవ‌లే మాస్ మ‌హారాజ‌ ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ సినిమా చేస్తుంది. కాగా శృతి కేవ‌లం న‌టిగానే కాకుండా సింగ‌ర్‌, కంపోజ‌ర్‌గా కూడా సుప‌రిచిత‌మే.

ఈ మ‌ధ్య వ‌ర‌కూ శృతి హాస‌న్ యూకేలో చాలా మ్యూజిక‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చింది. అయితే త‌న మ్యూజిక్ టూర్ల‌ను ఇండియ‌న్స్ మిస్ అవుతూండ‌టంతో.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మ‌ధ్యే ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా సోష‌ల్ మీడియాలో సంభాషించిన శృతి.. త్వ‌ర‌లోనే ఓ యూట్యూబ్ ఛానెల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. యూట్యూబ్ ద్వారా ఫ్యాన్స్‌కి మ‌రింత ద‌గ్గ‌ర అవ్వాల‌ని ఆలోచిస్తున్నా అంటూ తెలిపింది. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో అన్నీ సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్‌తో పాటు నా ప్ర‌ద‌ర్శ‌న‌లు.. మ్యూజిక‌ల్ టూర్ల‌కు సంబంధించిన అన్ని వీడియోలు కూడా అప్‌లోడ్ చేస్తాన‌ని చెప్పుకొచ్చింది శృతి.

anukokunda hero ayye chance nu miss chesukunna rajendra prasad!

my parents should be proud of my films: sai Pallavi