దగ్గుబాటి రా నా, చిన్ననాటి నుంచి మంచి భోజన ప్రియుడు, రా నా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివే రోజుల్లో ఆయనకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండే వాడు, అతనితో కలసి ఓల్డ్ సిటీ లో ఉన్న రెస్టారెంట్స్ లో దొరికే సాంప్రదాయ ముస్లిం వంటలు అన్ని రుచి చూసేసారు రా నా . మాములుగా స్కూల్ బంక్ కొట్టి చాలామంది మూవీస్ కి, కొంత మంది గర్ల్ ఫ్రెండ్స్ తో ఔటింగ్ వెళ్లడం సహజం. కానీ రా నా గారు మాత్రం స్కూల్ బంక్ కొడితే నెక్స్ట్ కనపడేది ఎదో, ఒక మంచి రెస్టారెంట్ లో తింటూ కనపడే వారట. తినటానికి స్కూల్ టీచర్ అయిన టీ.జె. బెన్హర్ గారి దగ్గర అప్పుచేసి, ఆ అప్పు తీర్చటం కోసం పెద్ద స్కీం వేసి ఆ అప్పు తీర్చేవారు. ఆ స్కీం ఏమిటంటే ఏ మాస్టర్ దగ్గర అయితే అప్పు తీసుకున్నారో, ఆ మాస్టర్ దగ్గర ట్యూషన్ కి వెళుతున్నాను అని వాళ్ళ అమ్మ కు కహాని చెప్పి 6 నెలలకు ఒక సారి, అమ్మ,బెన్హర్ మాస్టర్ కి ట్యూషన్ ఫీజు ఇవ్వాలి అని చెప్పి వారి అమ్మ గారి దగ్గర డబ్బులు తీసికొని ఆ అప్పు తీర్చేసే వారట.
చిన్న తనం నుంచి ఎంత కాలికులేటెడ్ మైండ్ చూడండి, అందరికి రమ్మంటే వస్తాయా ఇటువంటి ఆలోచనలు. తాను ఇంత పెద్ద హీరో అయినా కూడా, ఆ ఓల్డ్ హ్యాబిట్ కంటిన్యూ చేస్తున్నారు, అంటే అప్పు చేయటం కాదు, ఓల్డ్ సిటీ కి వెళ్లి ఫుడ్ తినటం కంటిన్యూ చేస్తున్నారు రా నా. ముఖ్యం గ రంజాన్ రోజుల్లో దొరికే రక రకాల ముస్లిం సాంప్రదాయక వంటలు అంటే రా నా గారికి చాల ఇష్టం.కేవలం ఫుడ్ ఒక్కటే కాదు, తన ఓల్డ్ ఫ్రెండ్స్ అన్న కూడా వారికీ చాల ఇష్టం, సెలబ్రిటీ లాగా ముడుచుకొని ఉండటం ఆయనకు తెలియదు.