
వరుసగా స్టార్ హీరోల సరసన సినిమాలు చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య జోరు తగ్గించింది. మద్యమద్యలో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టిన ఇప్పడు అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయని చెప్పాలి. చివరగా నాగార్జున సరసన మన్మధుడు 2 లో నటించింది రకుల్. ప్రస్తుతం రకుల్ పెద్ద ఫంక్షన్స్ లో స్టేజ్ షో లు చేస్తోంది. తనకున్న క్రేజ్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ అమ్మడు ఏకంగా ఒక్క స్టేజ్ షోకి కోటి డిమాండ్ చేస్తోంది. స్టేజ్ షో లకు బాలీవుడ్ స్టార్స్ కోట్లు డిమాండ్ చేయడం మనం చూసాం . వారితో పాటు రకుల్ ప్రీత్ సింగ్ కూడా కోటి వసూళ్లు చేయడం చూస్తుంటే అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అర్ధమవుతుంది. క్రేజ్ మాట అటు పెడితే..ఈమె డిమాండ్స్ చూసి కొందరు పారిపోతున్నారు అంట, ఎవరో ఒకరిద్దరు బడా ప్రొడ్యూసర్స్ తప్ప ఎవ్వరు రకుల్ ను అప్రోచ్ అవ్వట్లేదు. అసలే ఫేడ్ అవుట్ అయిపోతున్న ఈ భామ కు టాలీవుడ్ లో పూర్తి గ ఛాన్సెస్ తగ్గిపోయాయి, ఇలాంటి సమయంలో ఎంతో కొంత అమౌంట్ కు చేసుకోవాలి కానీ ఈ డిమాండ్స్ ఏంట్రా బాబు అని తిట్టుకుంటున్నారు.

