in

senior ntr special!

1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డుగా ఆయన అభివర్ణిస్తారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత సంవత్సరాల తరబడి ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ చేతిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి.

1940ల్లో కుటుంబానికి అండగా ఉండడం కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు.

40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు.

ఎన్టీఆర్ ను భగవత్స్వరూపంగా భావించే ఆయన అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు.

దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఎన్టీఆర్ ది.

ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు.

‘శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర’ సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.

1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ దారిన వెళ్లారు. ఆనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్య మంత్రి కూడా అయ్యారు.

తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు.

pooja’s Instagram account hacked!

balayya shocking comments!