తెలుగులో ఇది వరకు ఐటమ్‌సాంగ్స్‌లో నటించడానికి ప్రత్యేకంగా డాన్సర్స్ ఉండే వారు. ముమైత్‌ఖాన్ లాంటి డాన్సర్‌లు ప్రత్యేకంగా ఐటమ్ సాంగ్స్‌లోనే నటించేవారు. కానీ ప్రస్తుతం టాప్ హీరోయిన్‌లే ఐటమ్ సాంగ్స్‌లో డాన్స్ చేస్తూ భారీ పారితోషికం అందుకుంటున్నారు. దీనికి కారణం తెలుగులో ఐటమ్ సాంగ్స్‌కు భారీ డిమాండ్ ఉండడమే. ప్రస్తుతం ఒక్క సాంగ్ చేస్తేనే హీరోయిన్‌లు కోటి వరకు రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు.
కాగా తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ రెజీనా ఐటమ్ సాంగ్ చేసింది. దాని పై ఆమె స్పందిస్తూ..చింరజీవి సినిమాలో ఆయన పక్కన డాన్స్ చేసే చాన్స్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. చిరంజీవి పక్కన సాంగ్ అనగానే ఓకే మాటలో ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది. కానీ ఈ సాంగ్‌లో నటించిన తనను ఐటమ్ అనవద్దని సాంగ్‌ను కూడా ఐటమ్ సాంగ్ అని పిలవద్దని కోరింది. ఈ సాంగ్‌ను 5 రోజులు రాత్రుల్లో షూట్ చేశామని చిరంజీవి తన డాన్స్‌ను అభినందించారని ఆమె సంతోషపడింది.