
తన ప్రేమ విషయాన్ని వెలువరించి రానా సంలచనం రేపడంతో.. రానా అభిమానులతో పాటుగా చాలా మంది గూగుల్‌లో మిహీక వివరాలు వెతకడం ప్రారంభించారు. ఆమెకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..మిహీక పక్కా హైదరాబాదీ.. ప్రస్తుతం ఆమె డ్యూ డ్రాప్ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. ఇండియన్ ఆర్కిటెక్చర్‌పై ఇష్టంతో.. ముంబైలోని రచన సంసద్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకున్నారు. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేశారు. ఇలా ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. మిహీక తల్లిదండ్రులు విషయానికి వస్తే తండ్రి పేరు సురేష్ బజాజ్, తల్లి బంటీ బజాజ్. ఆమె తల్లి హైదరాబాద్‌లోనే క్రస్లా బ్రాండ్ పేరిట జ్యూవెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిహీకకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు.. అతని పేరు సమర్థ్. అంతేకాకుండా వెంకటేశ్ కమార్తె అశ్రితకు మిహీక మంచి స్నేహితురాలని సమాచారం.

