
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రల్లో నటించి మెప్పించిన సురేఖావాణి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. పలు చిత్రాల్లో భార్య, అక్క, వదిన, తల్లి ఇలా పలు క్యారెక్టర్స్‌లో నటించి తనదైన నటనతో ఆ పాత్రలకు న్యాయం చేశారు. రీల్‌పైనే కాదు.. రియల్‌లైఫ్‌లోనూ మోడ్రన్ మదర్‌గా సురేఖా వాణి రాణిస్తున్నారు. అది ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూస్తే అర్థమవుతుంది. తన కుమార్తెతో కలిసి ఆమె సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఎబీఎన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ కుమార్తెను సినిమాల్లోకి పంపిస్తారా? అని అడిగితే.. అది తన కుమార్తె నిర్ణయమని, తను సినిమాల్లోకి వెళ్తానంటే తనకెలాంటి అభ్యంతరం లేదని సురేఖావాణి తెలిపారు.

