సిల్క్ స్మిత..దక్షిణాది సినీ పరిశ్రమలో ఈమె ఒక సంచలనం. ఎంత త్వరగా గగనానికి ఎగసిందో..అంతే త్వరగా పడిపోయింది సిల్స్ స్మిత. ఆమె జీవిత కథాశంతో డర్టీ పిక్చర్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో సినిమాలలో తన అందచందాలతో, యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికే అంతుచిక్కని మిస్టరీనే. చాలా తక్కువ వయసులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనక ఎన్నో చీకటి రహస్యాలు ఉన్నాయని ఇప్పటికే చెప్పుకుంటూనే ఉంటారు. అయితే తాజాగా సిల్క్ స్మిత స్నేహితుడు.. కన్నడ సూపర్ స్టార్ రవిచంద్రన్ ఆమె మరణానికి ముందు రోజు జరిగిన కొన్ని సంఘటనలు బయటకు చెప్పారు.
అప్పట్నుంచే వీళ్లు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆమె చనిపోయే ముందు వరకు కూడా ఈ స్నేహం కొనసాగింది. స్మిత తనతో ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేదని.. అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా ఉండేవాడినని చెప్పుకొచ్చాడు రవి.
ఈమె చనిపోయే ఒక్కరోజు ముందు తనకు ఫోన్ చేసిందని చెప్పాడు ఈ నటుడు. ఆమె డిప్రెషన్ లో తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది వీలుపడలేదని గుర్తు చేసుకున్నాడు. ఓ షూటింగ్‌లో ఉన్నందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోయానని..లేకపోతే దారుణం జరిగిఉండకపోయేదని అభిప్రాయపడ్డాడు.
అదేదో రెగ్యులర్ కాల్ అనుకున్నానని.. అందుకే మళ్లీ కాల్ చెయ్యలేదని చెప్పాడు రవిచంద్రన్. 1996 సంవత్సరం సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత తనకు కాల్ చేసిందని.. ఆ తర్వాత రోజే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పాడు రవిచంద్రన్. సిల్క్ స్మిత చనిపోవడం తనకు లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం అని చెప్పాడు.