ప్రస్తుత కాలంలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే సంవత్సరంలో రిలీస్ అయ్యే పరిస్థితి కూడా కనిపించడం లేదు.. అలాంటిది ఒకే రోజున, రెండు సినిమాలు రిలీస్ చేసి నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రికార్డ్స్ ను సాధించిన మన స్టార్ హీరోలు ఎవరో తెలుసా..
తెలుగు సినిమా చరిత్రలో ఒకేరోజు రెండు సినిమాలు రిలీస్ చేసి రికార్డు సృష్టించిన హీరో ఎన్టీఆర్ గారు, 5 May 1961 రోజున, పెండ్లి పిలుపు, సతి సులోచన, ఈ రెండు సినిమాలు రిలీస్ చేసారు. ఎన్టీఆర్ గారి తరువాత ఈ రికార్డు సాధించిన నెక్స్ట్ హీరో అందాల నటుడు శోభన్ బాబు గారు, 19 July 1968 లో లక్ష్మి నివాసం, పంతాలు పట్టింపులు, అదే రోజున రిలీస్ చేసారు. ఆ తరువాత 19 September 1980 రోజున, మెగా స్టార్ చిరంజీవి గారు నటించిన కాళీ, తాతయ్య ప్రేమలీలలు, అనే సినిమాలు రిలీస్ అయ్యాయి.
వీరి తరువాత సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ ఘనతను సాధించారు, January 14 1984 రోజున, యుద్ధం, ఇద్దరు దొంగలు, సినిమాలు రిలీస్ చేసారు. నందమూరి నటసింహం బాలకృష్ణ గారు కూడా ఈ అరుదైన రికార్డు ను సాధించారు, 3 September 1993 లో, బంగారు బుల్లోడు, నిప్పు, అదే రోజున రిలీస్ చేసారు. నాచురల్ స్టార్ నాని రెండు సినిమాలు కూడా ఒకేరోజు రిలీస్ అయ్యాయి, 21 March 2015 రోజున, ‘ ఎవడే సుబ్రహ్మణ్యం’ ఇంక ‘జండాపై కపిరాజు’ సినిమాలతో మన ముందు వచ్చాడు. ఇంక చివరిసారిగా ఈ ఘనత సాధించిన హీరో అల్లరి నరేష్ గారు, 8 February 2008 రోజున, విశాఖ ఎక్ష్ప్రెస్స్ , సుందర కాండ, సినిమాలను రిలీస్ చేసారు..