in

WHAT’S HAPPENING WITH SWATHI?

 

కలర్స్ ప్రోగామ్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన స్వాతి ఆ తర్వాత వెండితెరకు ప్రమోట్ అయ్యింది. తెలుగులో పర్వాలేదు అనిపించినా ఈ అమ్మడు 2018లో తన సోదరుడు స్నేహితుడు వికాస్ ను ప్రేమపెళ్లి చేసుకుంది. రెండేళ్లుగా సాఫీగా సాగుతుందని అనుకున్న స్వాతి మ్యారేజ్ లైఫ్ కూడా అనుకున్నంత విధంగా లేదట. వికాస్, స్వాతిల మధ్య తరచూ గొడవలు అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇటు కుటుంబ సభ్యుల దాకా వీరి గొడవలు వెళ్లడం వారు వచ్చి సర్ది చెప్పడం జరుగుతుందట. అయితే రీసెంట్ గా మరోసారి వికాస్, స్వాతిల మధ్య చాలా పెద్ద గొడవ అయ్యిందట. ఈసారి వాళ్లిద్దరూ కలిసే అవకాశం లేదని.. ఇద్దరు విడాకులకు సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది ఇద్దరు వారి సోషల్ బ్లాగుల్లో తమ పెళ్లి ఫోటోలు.. ఇద్దరు దిగిన ఫోటోలు కూడా డిలీట్ చేశారు. దాదాపు ఇద్దరు డైవర్స్ కు డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. అంతేకాదు విడాకులు రాకుండానే స్వాతి సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. కార్తికేయ 2లో కూడా స్వాతి గెస్ట్ రోల్ చేస్తుందని తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే స్టోరీ డిస్కషన్స్ చేస్తుందని అంటున్నారు. మరి స్వాతి డైవర్స్ విషయమై అఫీషియల్ న్యూస్ బయటకు రావాల్సి ఉంది.

7 YEARS FOR GUNDE JAARI GALLANTHAYYINDE!

UPASANA’S QUARANTINE GOAL!